తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2021, 12:06 PM IST

ETV Bharat / bharat

విపక్షాల భేటీకి టీఎంసీ దూరం- దీదీ వ్యూహమేంటి?

కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్​లో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ఈ భేటీలో పాల్గొని సభ్యులతో మాట్లాడారు. ప్రజా సమస్యలనే పార్లమెంట్​లో ప్రస్తావిస్తున్నామని, వీటిపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి టీఎంసీ నుంచి ఎవరూ రాకపోవడం గమనార్హం.

Opposition leaders meeting
పార్లమెంట్​లో విపక్షాల భేటీ

పార్లమెంట్ ఉభయ సభల ప్రారంభానికి ముందు.. విపక్ష పార్టీల ఎంపీలు దిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీకి.. ఎన్​సీపీ, శివసేన సహా 14 పార్టీల పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. పెగాసస్, సాగు చట్టాలు సహా పలు సమస్యలపై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది.

సమావేశంలో విపక్ష నేతలు
.

అయితే, దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్.. ఈ సమావేశానికి గైర్హాజరైంది. ఆ పార్టీ తరపున ఎవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం.

చర్చ జరగాల్సిందే: రాహుల్

మరోవైపు, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొని ఎంపీలతో మాట్లాడారు. దేశంలోని ప్రధాన సమస్యలపై చర్చ విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాహుల్ పేర్కొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ద్రవ్యోల్బణం, పెగాసస్, రైతుల సమస్యలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. సభ​లో వీటిపై చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

పార్లమెంటులో అంతరాయాలపై నెపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపైకి నెడుతున్నారని సమావేశంలో రాహుల్ పేర్కొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నదాతలు, దేశ భద్రత సహా ప్రజా సంబంధిత సమస్యలనే పార్లమెంట్​లో ప్రస్తావిస్తున్నామని రాహుల్ స్పష్టం చేశారని వెల్లడించాయి. దీనికి విపక్ష సభ్యులు రాహుల్​కు మద్దతు పలికినట్లు చెప్పాయి.

ఇదీ చదవండి:కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణం

ABOUT THE AUTHOR

...view details