తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా వాళ్లు సేవలో.. వారేమో క్వారంటైన్​లో' - మోదీ ఎనిమిదేళ్ల పాలన

కరోనా ఆపత్కాలంలో తమ పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం క్వారంటైన్​లో కాలం వెళ్లదీస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ.. కనీసం రెండు గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో వర్చువల్​గా సమావేశమయ్యారు.

nda govt anniversary
జేపీ నడ్డా

By

Published : May 30, 2021, 2:29 PM IST

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ సర్కారు ఏడో వసంతం పూర్తి చేసుకుని, ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. ప్రతిపక్షాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఆదివారం విమర్శలు గుప్పించారు. కరోనా సంక్షోభం వేళ.. తమ పార్టీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం క్వారంటైన్​లో గడుపుతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన వర్చువల్​గా​ పాల్గొన్నారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే.. కనీసం రెండు గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయాలని కోరారు.

"మహమ్మారి విజృంభణ వేళ.. ప్రజలకు భాజపా కార్యకర్తలకు సహాయం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు మాత్రం వర్చువల్​ విలేకరుల సమావేశంలో మాత్రమే కనిపిస్తున్నారు. మా కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వేళ.. వాళ్లేమే క్వారంటైన్​లో కాలం వెళ్లదీస్తున్నారు."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

వ్యాక్సిన్ల కోసం ఇప్పుడు ఎవరైతే ఎదురు చేస్తున్నారో.. ఒకప్పుడు వారే టీకాలపై అనుమానాలు లేవనెత్తారని నడ్డా విమర్శించారు. భాజపా తలపెట్టిన కరోనా సహాయ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు.

కొవిడ్ సహాయ సామగ్రి పంపిణీ కార్యక్ర మాన్ని ప్రారంభిస్తున్న జేపీ నడ్డా
సామగ్రిని పరిశీలిస్తున్న నడ్డా
భాజపా వార్షికోత్సవ వేడుకల్లో జేపీ నడ్డా

మరోవైపు.. పార్టీ వార్షికోత్సవంలో భాగంగా.. 'సేవా దివస్​' పేరుతో పలు సేవా కార్యక్రమాలకు భాజపా శ్రీకారం చుట్టింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి:Mann Ki Baat: 'సబ్​కా సాత్​, వికాస్​, విశ్వాస్​ మంత్రంతో ముందుకు'

ABOUT THE AUTHOR

...view details