Margaret Alva Nomination: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆళ్వా.. నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, వామపక్షాల నుంచి సీతారాం ఏచూరి, డి. రాజా సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అధికార పక్షం ఎన్డీఏ తరఫున సోమవారం నామినేషన్ దాఖలు చేశారు బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్. ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లకు మంగళవారమే ఆఖరి రోజు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఉన్న ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే.
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 'ఆళ్వా' నామినేషన్.. వెంటవచ్చిన పవార్, రాహుల్ - లోక్‌సభ సెక్రటరీ జనరల్
Margaret Alva Nomination: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మార్గరెట్ ఆళ్వా.. మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Opposition candidate Margaret Alva files nomination for Vice Presidential election