Parliament session monsoon 2022: పార్లమెంటులో సస్పెన్షన్, వాయిదాల పర్వం బుధవారం కూడా కొనసాగింది. ఇరు సభల్లోనూ విపక్షాలు కేంద్రంపై నిరసనకు దిగాయి. ఇప్పటికే 24 మంది ఎంపీలు సస్పెన్ష్‌కు గురవగా.. తాజాగా బుధవారం మరో రాజ్యసభ ఎంపీపై వేటు పడింది. అనుచితంగా ప్రవర్తన కారణంగా ఆమ్ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.
ఎంపీల సస్పెన్ష్‌ను విపక్షాలు తప్పుపట్టాయి. సస్పెన్ష్‌ను తక్షణమే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశాయి. సస్పెన్షన్‌కు గురైన 20 మంది రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. 50 గంటలపాటు ఇలానే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత రెండు రోజుల్లో సస్పెన్షన్‌కు గురైన 20 మంది ఎంపీల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెరాస చెందిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ ఆమ్ఆద్మీల నుంచి చెరో ఎంపీ ఉన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ఒక రాజు అని.. అందుకే 57 మంది ఎంపీలను, 25 ఎంపీలను సస్పెండ్ చేయించారన్నారు. ప్రశ్నలకు భయపడే మోదీ ఇదంతా చేస్తున్నారన్నారు.
రాహుల్ ఆధ్వర్యంలో పార్లమెంటు బయట నిరసన పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్న ఎంపీలు స్పీకర్ల కండీషన్: రాజ్యసభలో ఎంపీల సస్పెన్ష్పై విపక్ష నేతలు.. ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. సస్పెన్షన్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే చేసిన తప్పును ఒప్పుకుంటేనే సస్పెన్షన్ తొలగిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు. 10 మంది నేతలు పాల్గొన్న ఈ భేటీలో ధరల పెంపుపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని నేతలు వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు వరుస సస్పెన్ష్లతో సభలో గందరగోళం నెలకొనగా సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం సెషన్లో రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది.
లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి.. ధరల పెంపు, అగ్నిపథ్, జీఎస్టీ మొదలైన అంశాలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్ష నేతలు కోరగా.. ఇకపై నిరసనలు చేపట్టమని హామీ ఇస్తేనే ఉపసంహరణ చర్యలు చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. వెల్ వద్దకు వెళ్లకుండా, ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శన చేపట్టమని హామీ ఇవ్వాలన్నారు.
ఇదీ చూడండి :'ఇక మీరే చూసుకోండి!'.. జిల్లా కలెక్టర్ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!