తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మత్తు మందు ఇవ్వకుండా కిడ్నీ ఆపరేషన్.. బెంగళూరు వైద్యుల ఘనత! - operation without anesthesia

గుండె జబ్బు ఉన్న ఓ మహిళకు మత్తుమందు ఇవ్వకుండానే ఆపరేషన్​ చేసి కిడ్నీలోని రాళ్లను తొలగించారు వైద్యులు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

operation without anesthesia
operation without anesthesia

By

Published : Nov 22, 2022, 6:05 PM IST

మత్తుమందు ఇవ్వకుండా ఓ మహిళకు కిడ్నీ రాళ్లు తొలగించే ఆపరేషన్ చేశారు వైద్యులు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఆపరేషన్​ చేయించుకున్న మహిళకు చిన్నప్పటి నుంచే గుండె జబ్బు ఉండటం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది.. అసోంకు చెందిన ఓ మహిళ కడుపు నొప్పి కారణంగా బెంగళూరు జయానగర్​లోని ఓ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. ఆమె కడుపు నొప్పికి కారణం కిడ్నీలో రాళ్లు అని తెలిసింది. అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉంది. దీంతో ఆమెకు మత్తుమందు ఇవ్వడం కుదరదని వైద్యులు తెలిపారు. కానీ ఆపరేషన్​ కచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పేషెంట్​ పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసిన వైద్యులు, మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్​ చేయడానికి నిర్ణయించారు.

ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్​ను జాగ్రత్తగా 'ఐవీ సెడేషన్(IV sedation)'​ పద్ధతిలో, నిద్ర మాత్రలు ఇస్తూ, గుండె పరిస్థితిని ప్రతి క్షణం గమనిస్తూ పూర్తి చేశారు వైద్యులు. ఎక్స్​ట్రాకోర్పోరియల్ షాక్​ వేవ్​ లిథోట్రిప్సీ(Extracorporeal Shock Wave Lithotripsy (ESWL)) పద్ధతి ద్వారా 2.5 సెంటీ మీటర్ల రాయిని విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్​ జరుగుతున్నంత సేపు పేషెంట్​ గుండె పరిస్థితి నిలకడలా ఉండేటట్లు చూశారు. అయితే అపరేషన్​లో ఏదైనా కాంప్లికేషన్స్​ వస్తే పేషెంట్​కు చికిత్స అందించడానికి ఆస్పత్రిని సిద్ధం చేసినట్లు వైద్యులు తెలిపారు. ఎవరూ చేయలేని ఆపరేషన్​ను తాము చేశామని ఆస్పత్రి ఎమ్​డీ విక్రమ్​ సిద్ధారెడ్డి తెలిపారు. తాము అన్ని రకాల ఆపరేషన్లు చేయగలమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details