తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లులు, కుక్కలతో సేఫ్​గా భారత్​కు.. మూగజీవాల్ని యుద్ధభూమిలో వదిలేయలేక..

Operation Ganga: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో భారత్​కు తరలివస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు తాము పెంచుకుంటున్న జంతువులను కూడా వెంట తెచ్చుకున్నారు.

operation ganga
ఉక్రెయిన్​ టు భారత్

By

Published : Mar 3, 2022, 9:53 AM IST

Updated : Mar 3, 2022, 4:32 PM IST

పెంపుడు జంతువులతో భారత్​కు...

Operation Ganga: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను 'ఆపరేషన్​ గంగ' పేరుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తోంది. భీకర బాంబు దాడులు.. చావు కేకలతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి బయటపడే క్రమంలో అనుమతి లభించక చాలా మంది విద్యార్థులు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను వదిలేశారు. కానీ పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకువచ్చేందుకు ఇటీవల కేంద్ర అనుమతించడం వల్ల ఇన్నాళ్లూ తమ వెంటే ఉంటున్న ఆ మూగజీవాల్ని స్వదేశానికి తీసుకువచ్చారు.

పెంపుడు పిల్లిని వెంట తెచ్చిన గౌతమ్​ అనే విద్యార్థి

వాయుసేన ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో పోలాండ్​ నుంచి గురువారం పలువురు విద్యార్థులు భారత్​ చేరుకున్నారు. వారితో పాటు పెంపుడు పిల్లులు, శునకాలు దర్శనమిచ్చాయి. ఇన్నాళ్లు తమ వెంటే ఉన్న ఈ పెంపుడు జంతువులను అక్కడి ఉద్రిక్తత పరిస్థితుల్లో వదిలేయడం ఇష్టం లేక వాటిని కూడా భారత్​కు తెచ్చామని తెలిపారు.

స్నేహితుడి పెంపుడు శునకంతో జహీద్

"నా పెంపుడు పిల్లి గత నాలుగు నెలలుగా నా వెంటే ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో నాతో పాటే బంకర్లలో తలదాచుకుని, పోలాండ్​ సరిహద్దులు దాటి ఇప్పుడు భారత్​ చేరుకుంది."

-గౌతమ్, విద్యార్థి

కేరళకు జహీద్​ మరో విద్యార్థి కూడా తన స్నేహితుడు ఉక్రెయిన్​లో వదిలేసిన పెంపుడు శునకాన్ని వెంట తెచ్చుకున్నాడు.

స్వదేశానికి మరో 628 మంది..

వాయుసేన చేపడుతున్న విద్యార్థుల తరలింపు ప్రక్రియలో భాగంగా మరో 628 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం మధ్య మూడు విమానాలు గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ల్యాండ్​ అయ్యాయి. రోమేనియా రాజధాని బుకారెస్ట్​, హంగరీలోని బుడాపెస్ట్​, పోలాండ్​లోని రెజోవ్​ నగరాల నుంచి ఈ విమానాలు వచ్చాయి.

బుకెరాస్ట్​ నుంచి వచ్చిన విమానంలో 200 మంది, బుడాపెస్ట్​ నుంచి వచ్చిన దాంట్లో 220 మంది, రెజోవ్​ నుంచి వచ్చిన విమానంలో 208 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.

తరలింపు ప్రక్రియపై పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులు హర్​దీప్​ సింగ్​ పూరీ, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్​ రిజిజు, వీకే సింగ్​ ఇప్పటికే ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన హంగరీ, రోమేనియా, స్లోవేకియా, పోలాండ్​ చేరుకున్నారు.

ఇదీ చూడండి :Russia Ukraine War: శునకంపై ప్రేమతో.. ఉక్రెయిన్​లోనే భారతీయ విద్యార్థి

Last Updated : Mar 3, 2022, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details