Operation Devi Shakti Latest News: సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గానిస్థాన్ నుంచి భారతీయులతో పాటు.. అఫ్గాన్ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చింది కేంద్రం. ప్రత్యేక విమానంలో 104 మంది శుక్రవారం భారత్‌లో అడుగుపెట్టారు.
Indian Nationals in Afghanistan: వీరిలో కాబుల్ నుంచి 10 మంది, ఇతర ప్రాంతాల నుంచి మిగతా వారు వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆగస్టు 15న అఫ్గాన్‌ను తాలిబన్‌లు చేజిక్కించుకున్న అనంతరం భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ దేవీ శక్తి'ని కేంద్రం ప్రారంభించిందని గుర్తుచేశారు.
"ఈ విమానంలో అఫ్గానిస్థాన్‌లోని హిందూ-సిక్కు మైనారిటీకి చెందిన 10 మంది భారతీయులు సహా.. 94 మంది అఫ్గాన్ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చాం. వీరిలో 9 మంది చిన్నపిల్లలు, ముగ్గురు శిశువులు ఉన్నారు."