Operation cannabis hunting: మాదకద్రవ్యాలపై.. తమిళనాడువ్యాప్తంగా గత 20 రోజులుగా భారీ స్థాయిలో ఆపరేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ. 23కోట్లు విలువగల హెరాయిన్, రూ. 4.2కోట్లు విలువ చేసే కుట్కా, రూ. 18కోట్లు విలువ చేసే గంజాయిని అధికారులు జప్తు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 6,623మందిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా.. తూత్తుకుడిలో 23కేజీల హెరాయిన్ బయటపడింది. ఇందులో భాగంగా పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు గంజాయి అక్రమ రవాణా విషయంలో.. మూడు వారాల్లో ఏకంగా 816 కేసులు నమోదయ్యాయి. 871మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 1.88కోట్ల గంజాయిని పట్టుకున్నారు.