భారత్ రూపొందించిన విధ్వంసకర బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి రక్షణాత్మక వర్షెన్‌ను మాత్రమే అందించాలని భారత్ నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు 'ఈటీవీ-భారత్'కు తెలిపాయి.
"దక్షిణాఫ్రికా నుంచి దక్షిణ అమెరికా వరకు అనేక దేశాలు భారత్‌ను సంప్రదిస్తున్నాయి. కానీ ఇప్పటికైతే భూమి నుంచి సముద్రంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణి మాత్రమే అమ్మకానికి ఉంది. దీనినే డిఫెన్సివ్ వర్షెన్ అని అంటారు. స్వీయ రక్షణ కోసం దేశాలు దీనిని కొనుగోలు చేయవచ్చు. విమానం, నౌక, జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్షిపణి(అఫెన్సివ్ వర్షెన్)ని ప్రస్తుతం భారత్ అమ్మడం లేదు."
--- అధికార వర్గాలు.