చొరబాట్లను భాజపా మాత్రమే ఆపగలదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది 'నకిలీ లౌకికవాదం' అని విమర్శించారు. పూర్వబర్ధమాన్ జిల్లా అస్గ్రామ్, నదియా జిల్లా చాప్రాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. చొరబాటుదారులను టీఎంసీ ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటోందని ఆరోపించారు.
"చొరబాట్లను కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు ఆపలేవు. భాజపా మాత్రమే వాటిని ఆపగలదు. మమతా బెనర్జీది నకిలీ లౌకికవాదం. ఆమె తన ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆలోచిస్తారు. శవాలతో రాజకీయం చేస్తారు. విద్వేష రాజకీయలను ప్రోత్సహిస్తారు. అందుకే బంగాల్లో హింస తీవ్రస్థాయిలో ఉంది."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి