ఉన్నతస్థాయి న్యాయమూర్తుల్లో మహిళల వాటా కేవలం 11.04శాతం మాత్రమే ఉందని, వివిధ హైకోర్టు జడ్జీలుగా యోగ్యమైన మహిళా న్యాయమూర్తులను నియమించాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 'సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం(ఎస్సీడబ్ల్యూఎస్ఏ)' దీన్ని దాఖలు చేసింది. ఈ అంశంలో గతంలో దాఖలైన కేసులో తమను కూడా ప్రతివాదిగా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
"ఉన్నత స్థాయిలో 1,080 శాశ్వత అదనపు న్యాయమూర్తి పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 661 మందే ఉన్నారు. అందులో మహిళా న్యాయమూర్తులు కేవలం 18 మందే! 1950 నుంచి ఇప్పటివరకూ సుప్రీంకోర్టులో మొత్తం 247మంది న్యాయమూర్తులు నియమితులు కాగా... వారిలో కేవలం 8 మందే మహిళలు! ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే సర్వోన్నత న్యాయస్థానంలో సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు," అని ఎస్సీడబ్ల్యూఎల్ఏ పేర్కొంది.
ఆ ప్రతిపాదనలకు ఆమోదం..