తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15 నుంచి అమర్​నాథ్​ యాత్రకు పేర్ల నమోదు - అమర్​నాథ్​ యాత్ర

అమర్​నాథ్​ యాత్రకు యాత్రికులు ఈ నెల 15 నుంచి ఆన్​లైన్​లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని దేవస్థానం బోర్డు చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ నీతీశ్వర్​ కుమార్​ చెప్పారు. పేర్లను నమోదు చేసుకోవాల్సిన వెబ్​సైట్​ వివరాలు వెల్లడించారు.

Online registration of Amarnath yatra to begin from April 15
అమర్​నాథ్​ యాత్రకు ఈ నెల 15 నుంచి పేర్ల నమోదు

By

Published : Apr 13, 2021, 7:09 AM IST

అమర్​నాథ్​ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ నెల 15 నుంచి ఆన్​లైన్​లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని సోమవారం అధికారవర్గాలు తెలిపాయి. జూన్​ 28న ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగష్టు 22 వరకు మొత్తం 56 రోజులపాటు కొనసాగుతుంది. రెండు మార్గాలైన బల్తాల్​, చందన్​వారీల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

శ్రీ అమర్​నాథ్​జీ దేవస్థానం బోర్డు చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ నీతీశ్వర్​ కుమార్​ మాట్లాడుతూ యాత్రికులు తమ పేర్లను www.jksasb.nic.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పేర్ల రిజిస్ట్రేషన్​కు సంబంధించిన అన్ని వివరాలు దేవస్థానం వెబ్​సైట్​ www.shriamarnathjishrine.com లో ఉన్నాయని వివరించారు. ఫొటోతో పాటు, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 15 తరువాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలనే ఆమోదిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:బావిలో పడ్డ శునకాన్ని రక్షించిన 'సాహస' మహిళ

ABOUT THE AUTHOR

...view details