Online Games Tax : Online Games Tax : ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ అక్టోబర్ 1 నుంచి అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ మండలి భేటీ అనంతరం ఆమె ఈ ప్రకటన చేశారు. గుర్రపు పందాలు, క్యాసినో, ఇతర ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్స్‌పై పన్ను విధించాలని గతంలో మంత్రులు జీఎస్టీ కౌన్సిల్‌కు పలుమార్లు సిఫార్సు చేశారు. ఈ విషయంపై జీఎస్టీ మండలి భేటీలో కూడా అనేక సార్లు చర్చించారు. కాగా గత నెల జరిగిన 50వ కౌన్సిల్ సమావేశంలో ఇది మరోసారి చర్చకు వచ్చింది. ఈ చట్టవిరుద్ధమైన గేమింగ్స్‌పై 28 శాతం పన్ను విధించాలని మండలి ఏకాభిప్రాయ నిర్ణయానికి వచ్చింది. తాజా భేటీలో అమలు తేదీని ప్రకటించింది.
"బెట్టింగ్ సంబంధిత గేమ్స్‌పై 28 శాతం పన్ను విధించాలని కౌన్సిల్.. ఇంతకుముందు భేటీలోనే నిర్ణయం తీసుకుంది. కాగా తాజా సమావేశంలో దాని అమలుపై నిర్ణయం తీసుకున్నాం. క్యాసినో, గుర్రపు పందాలు ఇతర ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్స్‌పై ఈ పన్ను వర్తిస్తుంది. ఈ జీఎస్టీ అమలులోకి వచ్చిన ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష నిర్వహిస్తాము."
- నిర్మలా సీతారామన్,కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.