తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫ్రీ ఫైర్'​కు బానిస.. అనుక్షణం అదే కలవరింపు.. గాల్లో గన్​ పేల్చుతూ... - తమిళనాడులో ఫ్రీ ఫైర్​ గేమ్​కు బానిసైన విద్యార్థి

Online Game Addiction: అదే పనిగా ఫ్రీఫైర్ గేమ్ ఆడడం వల్ల ఓ విద్యార్థి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. అనుక్షణం ఆ గేమ్​ గురించే కలవరిస్తూ, చేతుల్ని గన్​లా పట్టుకుని గాల్లో పేల్చుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Online Game Addiction
ఫ్రీఫైర్ గేమ్​కు బానిసైన విద్యార్థి

By

Published : Apr 8, 2022, 11:27 AM IST

Online Game Addiction: ఫ్రీ ఫైర్ గేమ్​కు బానిసయ్యాడు ఓ 17 ఏళ్ల విద్యార్థి. సెల్​ఫోన్​లో​ నిత్యం గేమ్​ ఆడడం వల్ల బాలుడి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ఎవరితో సంబంధం లేకుండా తన లోకంలో తాను బతుకుతున్నాడు. గేమ్​ ఆడుతున్నాన్న భ్రమతోనే చేతులు ఊపుతున్నాడు. రెండు చేతులతో గన్​ పట్టుకుని పేల్చుతున్నట్లు ఊహించుకుని కలవరిస్తున్నాడు. బాధితుని తల్లిదండ్రులు కుమారుని వింత ప్రవర్తన పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగింది. బాధితుడికి ఈ నెల 4 నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్నారు. తమ పిల్లలు సెల్​ఫోన్​లకు బానిసగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సెల్​ఫోన్​లకు బానిసై రకరకాల వ్యాధులు

బాధితుడు నంగునేరికి చెందిన విద్యార్థి. సెల్‌ఫోన్‌లో నిరంతరం ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటం వల్ల ఇలా మానసిక అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ గేమ్‌లకు బానిసలుగా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్​లైన్ గేమ్స్​పై నిషేధం విధించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 'మాస్టర్'​ ప్లాన్​.. రంగంలోకి పీకే!

ABOUT THE AUTHOR

...view details