మధ్యప్రదేశ్ ఇందోర్ వేదికగా.. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుల్లో ఒకరిని రవి కిశోరియాగా గుర్తించారు. నిందితులు ఇద్దరిని హైదరాబాద్కు తరలిస్తున్నారు.
ఇదీ జరిగింది..
ఇందోర్లో శానిటైజేషన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు రవి కిశోరియా. తన స్నేహితుడితో కలిసి ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన ఓ మహిళను ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో బురిడీ కొట్టించారు. వారి మాయమాటలు నమ్మిన మహిళ.. రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టింది.
కొద్ది రోజుల్లోనే ఇందోర్ నుంచి హైదరాబాద్ మహిళకు ఓ యువతి ఫోన్ చేసింది. మీకు రూ.81 లక్షల బహుమతి వచ్చిందని తెలిపింది. ఈ స్కీంలో మరింత పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చని నమ్మించింది.