Online betting advertising: ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్ట విరుద్ధమని పేర్కొంది. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిని వినియోగిస్తున్న వారికి ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయని పేర్కొంది కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ.
" ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రకటనలను ప్రచురించవద్దు. ఆన్లైన్ అడ్వర్టైజ్మంట్ పబ్లిషర్స్, ఇండటర్మీడియరీస్ సహా ఆన్లైన్, సోషల్ మీడియాలు సైతం ప్రకటనలకు దూరంగా ఉండాలి. బెట్టింగ్, గ్యాంబ్లింగ్.. దేశంలోని చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. ముఖ్యంగా చిన్నారులు, యువత సహా వాటిని వినియోగదారులకు ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయి. ఆయా ప్రకటనల ద్వారా చట్టవిరుద్ధమైన ఈ చర్యను ప్రోత్సహించినట్లవుతుంది."