భారత్లో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం. ఈ ప్రక్రియ ఇలాగే సాగితే దేశ ప్రజలందరికీ టీకా పంపిణీ చేయడానికి కొన్నేళ్లు పడుతుందని పేర్కొంది. టీకా రెండో డోసు ఎక్కువ మంది ప్రజలకు అందడంలేదని తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో సోమవారం హోంశాఖ నిధుల డిమాండ్లపై ఇచ్చిన తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
"కరోనా టీకా పంపిణీ ప్రక్రియను కమిటీ గమనిస్తోంది. ఇప్పటివరకు భారత జనాభాలో 1 శాతం కంటే తక్కువ మందికే వ్యాక్సిన్ అందింది. ఈ రేటు ప్రకారం.. మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది" అని నివేదికలో పేర్కొంది.