మహారాష్ట్రలోని ధులే జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఊయలలో ఆడుకుంటున్న ఓ చిన్నారి.. వేడి టీ పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ జరిగింది.. జిల్లాలోని షింద్ఖేడా తాలూకాలోని చౌగావ్ ప్రాంతానికి చెందిన స్వాతి(1).. శనివారం ఊయలలో ఆడుకుంటుంది. అదే సమయంలో ఊయల సమీపంలో వేడి టీ ఉన్న పాత్రలో ఆమె పడిపోయింది. దీంతో స్వాతి తీవ్రంగా గాయాలపాలైంది. గమనించిన కుటుంబసభ్యులు.. చిన్నారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
విషాదం.. వేడి టీలో పడి ఏడాది చిన్నారి మృతి - ధులే జిల్లా వార్తలు
ఆడపిల్ల పుట్టిందని ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కానీ ఆ ఆనందం ఎన్నాళ్లు నిలవలేదు. వేడి టీ ఉన్న పాత్రలో పడి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Dhule: Girl dies after falling into hot tea pot
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. చిన్నారి మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వాతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.