ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. సంతానం లేకుండా ఏడాది వయసున్న ఓ దూడ పాలిస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఖోరాబర్‌లోని జార్వా నివాసి గిరి నిషాద్ సుమారు 15 రోజుల క్రితం ఓ దూడను తన ఇంటికి తీసుకువచ్చాడు. వారం రోజులు గడిచిన తర్వాత దూడ పాలు ఇవ్వడం ప్రారంభించింది. మొదట్లో పాలు తక్కువగా ఇచ్చేదని.. ఇప్పుడు 4 లీటర్ల పాలు ఇస్తుందని యజమాని గిరి నిషాద్ చెప్పారు. దూడను నందిగా భావించి కుటుంబ సభ్యులు పూజిస్తున్నారు. దూడ పాలు ఇవ్వటం అద్భుతం అని స్థానికులు అంటున్నారు. ఈ విడ్డూరాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంతేకాకుండా ఇంకా నమ్మకం కుదరని వాళ్లు దూడ నుంచి పాలు తీస్తున్నారు. దూడ కూడా అందుకు సహకరించడం వల్ల వచ్చిన జనాలు సులభంగా పాలు తీస్తున్నారు.
పాలు ఇస్తున్న ఏడాది వయసున్న దూడ.. విడ్డూరాన్ని చూసేందుకు జనాల ఆసక్తి - ఉత్తర్‌ప్రదేశ్‌లో పాలు ఇస్తున్న ఏడాది దూడ న్యూస్
సంతానం లేకుండా ఏడాది వయసున్న ఓ దూడ పాలిస్తోంది. ఈ విడ్డూరాన్ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తితో గోమాతకు పూజలు కూడా చేస్తున్నారు. ఓ వింత సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఈ అద్భుతం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..
రోజుకు నాలుగు లీటర్ల పాలు ఇస్తున్న ఏడాది వయసున్న దూడ
ఈ విషయం గురించి పశువైద్యుడు డాక్టర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ.. "గర్భం లేకుండా పాలు ఇవ్వడం, బిడ్డకు జన్మనిచ్చే ప్రక్రియలు అనేవి హార్మోన్ల మార్పు కారణంగా జరుగుతాయి. ఇంతకు ముందు దూడలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చికిత్సలో భాగంగా వాడిన మందులు కూడా ప్రభావం చూపించవచ్చు. ఈ సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా ఈ పాలు తాగటం వల్ల సమస్యలు ఉంటాయేమో అనే విషయంలో వైద్యుల సంప్రదింపు అవసరమని" ఆయన అన్నారు.
Last Updated : Dec 7, 2022, 11:15 AM IST