తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషుల 'ఉరి' అమలుకు నేటికి ఏడాది

దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'నిర్భయ' అత్యాచార ఘటన దోషులు ఉరికంబాన్ని ఎక్కి నేటికి ఏడాది పూర్తయింది. 2020, మార్చి 20న నలుగురిని ఉరితీశారు.

One year for nirbhaya culprits death
నిర్భయ దోషులకు శిక్ష పడి నేటితో ఏడాది

By

Published : Mar 20, 2021, 10:36 AM IST

దేశ రాజధాని దిల్లీలో కలకలం రేపిన 'నిర్భయ' అత్యాచార దోషులను ఉరితీసి నేటితో ఏడాది ముగిసింది. 2020 మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను తిహార్​ జైలులో ఉరి కంబానికి ఎక్కించారు.

2012 డిసెంబర్​ 16

ఓ ప్రైవేటు బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా పారామెడికల్ విద్యార్థి నిర్భయ​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయతో పాటు ఉన్న స్నేహితుడ్ని కిరాతకంగా చితకబాదారు. ఇద్దరిని బస్సులో నుంచి బయటకు తోసేశారు.

ఈ ఘటనకు సంబంధించి ముకేశ్, వినయ్, అక్షయ్, పవన్​లకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం.

ABOUT THE AUTHOR

...view details