తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​కు ఏడాది- కరోనా కట్టడిలో ఎక్కడున్నాం? - దేశవ్యాప్త లాక్​డౌన్​కు నేటితో ఏడాది

130 కోట్లకు పైగా జనవాహిని నిర్బంధంలోకి వెళ్లి నేటికి ఏడాది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కరోనాపై భారత్ తన పోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ సానుకూలతలు, ప్రతికూలతలు.. ప్రస్తుత పరిణామాలపై ప్రత్యేక కథనం.

one year for lockdown in india
లాక్​డౌన్​కు ఏడాది.. కరోనా కట్టడిలో ఎక్కడున్నాం?

By

Published : Mar 25, 2021, 1:08 PM IST

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించి నేటితో ఏడాది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సహా.. వైరస్​ను ఎదుర్కొనేందుకు దేశ వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో.. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలపై 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించింది కేంద్రం. ప్రపంచంలో అత్యంత కఠినంగా అమలైన లాక్​డౌన్​గా ఇది రికార్డుకెక్కింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్​డౌన్​ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు.

లాక్​డౌన్ సమయంలో దిల్లీ షహీన్​బాగ్​ ప్రాంతం

ఇదీ చదవండి:భారత్​ బంద్​: లాక్​డౌన్​గా మారిన జనతా కర్ఫ్యూ!

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

లాక్​డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రికార్డు స్థాయిలో జీడీపీ పడిపోయేందుకు కారణమైంది. సాంకేతికంగా దేశాన్ని మాంద్యంలోకి నెట్టింది. అయితే.. ఎంత వేగంగా పడిపోయిందో.. అంతే వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. పెట్టుబడులు పెరిగాయి. జీడీపీ గాడిలో పడింది. వచ్చే ఏడాది రికార్డు స్థాయి వృద్ధి నమోదవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.

బిహార్​లో ఇలా...

సానుకూలతలు

  • కరోనా కట్టడికి బలోపేతంగా మారిన వైద్య వ్యవస్థ
  • పరీక్షల సామర్థ్యం, ల్యాబ్​లు, పరికరాల పెంపు
  • మానవ కార్యకలాపాలు పరిమతం కావడం వల్ల పర్యావరణానికి మేలు
  • తగ్గిన కాలుష్యం
  • తగ్గిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు
  • పెరిగిన సాంకేతికత వినియోగం
  • ఓటీటీ, ఈ-కామర్స్​ సేవలకు పెరిగిన డిమాండ్
  • చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఆన్​లైన్ విద్య
  • స్వచ్ఛత, పరిశుభ్రతపై పెరిగిన అవగాహన
    హిమాచల్​ప్రదేశ్​లో నిర్మానుష్యంగా ప్రాంతం

ప్రతికూల ప్రభావాలు

  • లాక్​డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
  • ఇప్పటికీ కోలుకోని పలు రంగాలు
  • గణనీయంగా పెరిగిన నిరుద్యోగం
  • స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల తిప్పలు
  • పని కోల్పోయి రోజువారీ కూలీల అవస్థలు
    యువకుడికి మాస్క్ అందిస్తున్న యూపీ పోలీస్

ఇవీ చదవండి:

కరోనా కట్టడి..

లాక్​డౌన్ తర్వాత కరోనా కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 153 రోజుల్లో ఇదే అత్యధికం కావడం దేశ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతుంటడం.. మళ్లీ లాక్​డౌన్ రోజులను గుర్తు తెస్తోంది.

ప్రయాణికులు లేని కేరళ కొల్లం​లోని ఓ బస్టాప్

అప్పుడలా.. ఇప్పుడిలా..

అంశం అప్పుడు ఇప్పుడు
ల్యాబ్​ల సంఖ్య 57 2,425
పరీక్షల సామర్థ్యం వేలల్లో సగటున పది లక్షలు
కేసులు 564 1,17,87,534

అయితే, టీకా అందుబాటులోకి రావడం కరోనా పోరులో ఓ సానుకూలాంశం. 5.31 కోట్లకు పైగా డోసులను ఇప్పటికే పంపిణీ చేశారు.

కర్ణాటకలోని మంగళూరులో సర్వం బంద్!

కేసుల పెరుగుదల నేపథ్యంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. చేతులు తరచుగా కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి అనుసరించాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి:జనతా కర్ఫ్యూకు ఏడాది- మళ్లీ అదే పరిస్థితా?

ABOUT THE AUTHOR

...view details