తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా​లో ఉగ్రవాది హతం- పౌరుడు మృతి - కశ్మీర్​లో కాల్పులు

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో ఎన్​కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఓ సామాన్య పౌరుడు కూడా మృతిచెందాడని, మరో ఉగ్రవాది లొంగిపోయాడని పోలీసులు తెలిపారు.

encounter_kashmir
కశ్మీర్​ పోలీసుల కాల్పుల్లో ఓ ముష్కరుడు హతం

By

Published : Nov 6, 2020, 9:14 AM IST

Updated : Nov 6, 2020, 1:09 PM IST

ఉగ్రవాదుల ఏరివేత చర్యలో భాగంగా... జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్​లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. మరో ఉగ్రవాది భద్రతా సిబ్బందికి లొంగిపోయాడని, ఓ సామాన్య పౌరుడూ మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు.

ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో దక్షిణ కశ్మీర్​ జిల్లా పాంపోర్​లోని లాల్​పొరాలో భద్రతా బలగాలు గురువారం నిర్భంధ తనిఖీలు చేపట్టాయి. వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.

ఇదీ చదవండి:చైనాకు 'వందేభారత్' విమాన సేవలు రద్దు

Last Updated : Nov 6, 2020, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details