తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతా దళాల చేతిలో పాక్​ స్మగ్లర్​ హతం - పాక్​ జాతీయుడి హత్య

భారత్​-పాక్ సరిహద్దు వెంబడి పంజాబ్​లోకి మాదకద్రవ్యాలను చేరవేస్తున్న పాక్ స్మగ్లర్​ను పోలీసులు హతమార్చారు. సరిహద్దు అవుట్‌పోస్ట్​కు సమీపంలోని కక్కర్ అనే ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరినట్లు వివరించారు.

One Pakistani smuggler killed by security forces in Punjab, arms and drugs seized
సరిహద్దుల్లో పాక్ జాతీయుడి హత్య..

By

Published : Apr 7, 2021, 9:43 AM IST

భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్), పంజాబ్ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్​లో పాకిస్థాన్​కు చెందిన స్మగ్లర్‌ హతమయ్యాడు. పంజాబ్ అమృత్​సర్​​లోని కక్కర్​ ప్రాంతంలో ఈ ఆపరేషన్​ జరిగింది.

ఘటనాస్థలం నుంచి 22 ప్యాకెట్ల హెరాయిన్​తో పాటు.. 2 ఏకేఎం రైఫిల్స్, 4 రౌండ్ల మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో భారత్​కు చెందిన ఓ వ్యక్తిపైనా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

పాకిస్థాన్​ నుంచి అంతర్జాతీ సరిహద్దు వెంబడి మాదకద్రవ్యాల సరఫరా పెరుగుతుండటం పంజాబ్​కు తీవ్ర సమస్యగా మారింది.

ఇదీ చదవండి:భారత్​-పాక్​ సరిహద్దులో రూ.70కోట్ల హెరాయిన్​ పట్టివేత

ABOUT THE AUTHOR

...view details