తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో పురోగతి - ముకేశ్​ అంబానీ ముంబయి పోలీసులు

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఓ నిందితుడి వివరాలను పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

ambani, bomb case
యాంటిల్లా కేసులో నిందితుడి గుర్తింపు!

By

Published : Feb 27, 2021, 11:06 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ ఇంటి (యాంటిల్లా) సమీపంలో లభించిన పేలుడు పదార్థాల కేసులో పోలీసులకు పురోగతి లభించింది. జిలెటిన్​ స్టిక్స్​తో ఉన్న స్కార్పియో కారును పార్క్​ చేసిన నిందితుడి వివరాలు లభించినట్టు సమాచారం. సీసీటీవీ దృశ్యాలలో నిందితుడు నిలిపివేసిన కారు పక్క నుంచి ఓ తెల్లని ఇన్నోవా కారు వెళ్లడం పోలీసులు గుర్తించారు. ఆ వాహనంలోని వారు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి గురించి తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారును నిలిపారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గురువారం గుర్తించి తనిఖీ చేయగా జిలెటిన్​ స్టిక్స్​ సహా అంబానీనుహెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమయ్యాయి .

ఇదీ చదవండి :అంబానీ ఇంటి వద్ద 'బాంబుల కారు' కేసులో ట్విస్ట్!

ABOUT THE AUTHOR

...view details