తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమిలీ ఎన్నికలపై మమత అభ్యంతరం- కోవింద్ నేతృత్వంలోని కమిటీకి లేఖ - వన్ నేషన్ వన్ ఎలక్షన్

One Nation One Election On Mamata Banerjee : ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానంతో తాను ఏకీభవించనని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. లోక్​సభ, శాసససభలతోపాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీకి లేఖ రాశారు.

One Nation One Election On Mamata Banerjee
One Nation One Election On Mamata Banerjee

By PTI

Published : Jan 11, 2024, 3:41 PM IST

Updated : Jan 11, 2024, 3:49 PM IST

One Nation One Election On Mamata Banerjee :లోక్‌సభ, శాసనసభలతోపాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై టీఎంసీ అధినేత్రి, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీకి ఓ లేఖ రాశారు. వన్​ నేషన్​-వన్ ఎలక్షన్​ దేశ రాజ్యాంగ ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని దీదీ పేర్కొన్నారు.

1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి నిర్వహించిన విషయాన్ని బంగాల్ సీఎం మమతా బెనర్జీ గుర్తుచేశారు. అయితే కొన్నేళ్లపాటు సాగిన ఆ ప్రక్రియ క్రమంగా కనుమరుగైనట్లు చెప్పారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక భావనతో ఏకీభవించటం లేదని స్పష్టం చేశారు మమత. ఈ విధానం సూత్రీకరణ, ప్రతిపాదనతో విభేదిస్తున్నట్లు పేర్కొన్నారు. వెస్ట్‌మినిస్టర్ వ్యవస్థలో సమాఖ్య, శాసనసభలకు ఏకకాలం కాని ఎన్నికలు ప్రాథమిక లక్షణమని, దాన్ని మార్చకూడదన్నారు. ఏకకాలం కాని ఎన్నికలు దేశ రాజ్యాంగ ఏర్పాట్లకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణంలో భాగమని దీదీ పేర్కొన్నారు.

జమిలి ఎన్నికల నిర్వహణకు సూచనలు
జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి బుధవారం వరకు 5వేలకుపైగా సూచనలు అందాయి. జమిలి ఎన్నికల నిర్వహణపై సూచనలు సలహాలు ఇవ్వాలని గతవారం కోరిన కోవింద్‌ కమిటీ అందుకు జనవరి 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటివరకు 5వేలకుపైగా ఈ-మెయిల్స్‌ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానికసంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై రామ్‌నాథ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయల కోసం పలు రాజకీయ పార్టీలకు లేఖ కూడా రాసింది. లా కమిషన్‌ అభిప్రాయలను కూడా కమిటీ తీసుకుంది.

One Nation One Election Committee Members: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది. కమిటీలో రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్​కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్​ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.

పరిశుభ్రమైన నగరాలుగా ఇందౌర్, సూరత్- స్టేట్స్ లిస్ట్​లో మహారాష్ట్ర నంబర్.1

అయోధ్య రాముడికి ముస్లిం యువకుడి స్పెషల్ గిఫ్ట్- 51 వేల మందికి ఉచితంగా టాటూలు

Last Updated : Jan 11, 2024, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details