తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ నో- కమిటీని రద్దు చేయాలని ఖర్గే లేఖ - జమిలి ఎన్నికలు కాంగ్రెస్​

One Nation One Election Congress : 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అమలుకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని కాంగ్రెస్​ కోరింది. ఈ మేరకు కమిటీ సెక్రేటరీ నితేన్​ చంద్రకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఇందులో జమిలి ఎన్నికలను కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది.

Congress On One Nation One Election
One Nation One Election Congress

By PTI

Published : Jan 19, 2024, 3:22 PM IST

Updated : Jan 19, 2024, 3:51 PM IST

One Nation One Election Congress : లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసన సభలకు, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్​ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒకే దేశం-ఒకే ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ సెక్రటరీ నితేన్​ చంద్రకు శుక్రవారం లేఖ రాశారు. పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే, 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అనే ఆలోచనను పక్కనపెట్టాలని, అలాగే ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీని సైతం రద్దు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. 'రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మాజీ రాష్ట్రపతి సేవలను ఇందుకోసం వాడుకుంటుంది. ఈ చర్యను ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్యానెల్​ కమిటీ ఛైర్మన్​గా వ్యవహరిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దు' అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

"ప్రజల పక్షాన, కాంగ్రెస్​ పార్టీ తరఫున కమిటీ ప్యానెల్​కు నేను ఈ మేరకు అభ్యర్థిస్తున్నాను. జమిలి ఎన్నికలపై కేంద్రం, కోవింద్​ కమిటీ చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో వారు నిజాయితీతో వ్యవహరించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రజల ఆలోచనలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పార్లమెంటు, కేంద్ర ఎన్నికల సంఘంపై ఉన్నాయి. ఇందుకోసం ఈ మూడు వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలి. ఇలాంటి ఎన్నికలకు ప్రభుత్వం పోవడం రాజ్యాంగంలోని ఫెడరల్​ స్ఫూర్తికి విరుద్ధం."
- ప్యానెల్​ కమిటీకి రాసిన లేఖలో మల్లికార్జున ఖర్గే

Simultaneous Election Committee :జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ గతేడాది అక్టోబరు 18న ప్యానెల్​ కమిటీ కార్యదర్శి నితేన్​ చంద్ర ప్రతిపక్షాలు సహా దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే దీనికి ప్రతిస్పందనగా తాజాగా కాంగ్రెస్​ అధ్యక్షుడు ఖర్గే ఈ వ్యవహారంపై తమ పార్టీ వైఖరిని మరోమారు లేఖ ద్వారా తెలియజేశారు.

జమిలి ఎన్నికలు - దేశంపై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

దేశవ్యాప్తంగా రామనామ స్మరణ - ఆయన చూపిన విలువలు, చెప్పిన ధర్మం గురించి తెలుసుకుందామా?

Last Updated : Jan 19, 2024, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details