తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాజ్​మహల్​కు​ మరో నోటీస్.. రూ.2 కోట్లు నీటి పన్ను కట్టాలని డిమాండ్ - తాజ్​మహల్​కు మురుగు నీటి నిర్వహణ బిల్లు

ప్రపంచ ఏడు వింతల్లో ఒక్కటైన చారిత్రక కట్టడం తాజ్​మహల్​కు ఆస్తి పన్ను కట్టాలని ఇటీవల ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్​(ఏఎంసీ) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్​ఐ)కి జారీ చేసిన నోటీసులు తీవ్ర చర్చకు దారి తీశాయి. తాజాగా తాజ్‌మహల్‌కు నీటి సరఫరా, మురుగు నీటి మెయింటెనెన్స్​కు సంబంధించి పెండింగ్​లో ఉన్న బిల్లులను చెల్లించాలంటు మరో నోటీసు పంపారు ఏఎంసీ అధికారులు.

తాజ్​మహల్​కు మరో నోటీసు
Another notice to taj mahal

By

Published : Dec 20, 2022, 4:43 PM IST

తాజ్‌మహల్‌ సంరక్షణ బాధ్యతలు చూసే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)కి ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)మరో సారి నోటీసులు పంపించింది. తాజ్​మహల్​కు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించి బకాయి పడ్డ బిల్లులను చెల్లించమని కోరుతూ ఆగ్రా జల్కల్ విభాగం తరఫున నోటీసులు పంపించినట్లు ఆగ్రా మున్సిపల్​ అధికారులు తెలిపారు.

తాజాగా పంపిన నోటీసులో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ ఛార్జీల కింద మొత్తం రూ.1.96 కోట్లు విలువైన 13 బిల్లులను పంపడం ఏఎస్​ఐ అధికారులను షాక్​కు గురిచేసింది. ఈ పన్నులపై ఏఎస్​ఐ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తాజ్​మహల్​తో సహా దేశంలోని అనేక స్మారక చిహ్నాలకు ఈ రకమైన పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

వాస్తవానికి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం-1904 ప్రకారం చారిత్రక కట్టడాలకు ఇటువంటి పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 3,693 వారసత్వ ప్రదేశాలకు ఏఎస్​ఐ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తోంది.
అంతకుముందు ఆగ్రా మున్సిపల్​ కార్పోరేషన్​(ఏఎంసీ) తాజ్​మహల్​కు ప్రాపర్టీ ట్యాక్స్​ కింద రూ.1.47 లక్షల బిల్లును చెల్లించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)కు నోటీసు పంపిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details