కేరళ ఎర్నాకులంలో మరో షిగెల్లా కేసు నమోదైంది. వాడకుళం గ్రామానికి చెందిన 39 ఏళ్ల వ్యక్తికి సోమవారం.. ఈ వ్యాధి సోకిందని జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు.
బాధితుడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి సంక్రమణ పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎర్నాకులంలో రెండు షిగెల్లా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హెచ్చరించారు. జిల్లాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.