జమ్ముకశ్మీర్‌లోని హైదర్‌పొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter in kashmir) భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీటిని తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
వీరికి సంబంధించిన వివరాలపై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత హైదర్‌పొరా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.