దిల్లీ ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో ఎర్రకోట విధ్వంసానికి సంబంధించి మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసుల్లో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 127కు చేరింది.
చంఢీగడ్కు చెందిన 60ఏళ్ల సుఖ్దేవ్ సింగ్ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నటుడు దీప్ సిద్ధూ, జుగరాజ్ సింగ్, గుర్జాత్ సింగ్, సుఖ్దేవ్ సింగ్ల సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని పోలీసులు ప్రకటించారు. సుఖ్దేవ్ సింగ్ ఆందోళనకారులను ఎర్రకోట వైపు నడిపించినట్లు ఆధారాలు ఉన్నాయని సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.