తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ సర్కార్​కు షాక్- ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

బలపరీక్షకు ముందు పుదుచ్చేరి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యేతో పాటు డీఎంకే ఎమ్మెల్యే తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

One more Congress MLA resigned in Puducherry
పుదుర్చేరిలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

By

Published : Feb 21, 2021, 3:28 PM IST

Updated : Feb 21, 2021, 4:17 PM IST

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు గుడ్​బై చెప్పగా.. బలపరీక్షకు ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

రాజ్​భవన్​ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ్, తట్టాన్​చవాడి నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్.. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్నీ సైతం వదులుకున్నట్లు లక్ష్మీనారాయన్ తెలిపారు. సీఎం నారాయణసామి నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని అన్నారు.

వెంకటేశన్ రాజీనామా లేఖ
లక్ష్మీ నారాయణ్ రాజీనామా లేఖ

వీరిద్దరి రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి(కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్రులు కలిపి) బలం 12కు పడిపోయింది. మరోవైపు విపక్షాలకు సభలో 14 స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరిలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో ఈ నెల 22న శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వానికి ఇదివరకే స్పష్టం చేశారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 21, 2021, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details