నోరూరించే రకరకాల మామిడిపండ్లు తినాలని చాలా మందికి ఉంటుంది. అయితే.. ఎన్నో రకాలున్న ఈ మామిడి పండ్లు ఒకే చెట్టుకు కాస్తే.. నిజంగా ఈ ఊహెంతో బాగుంది కదూ! ఇది నిజం చేసి చూపించారు ఉత్తర్‌ప్రదేశ్ సహారన్పుర్కు చెందిన హార్టికల్చర్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారు. ఏకంగా 121 జాతుల మామిడి పండ్లు ఒకే చెట్టుకు కాసేలా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే..
అరుదైన చెట్టు...
సహారన్‌పుర్ జిల్లాలోని కంపెనీ బాగ్ ప్రాంతంలో ఈ అరుదైన మామిడి చెట్టు ఉంది. ఐదేళ్ల క్రితం ఉద్యాన అధికారులు చేపట్టిన ప్రయోగం ద్వారా ఒకే చెట్టుకు 121 రకాల మామిడి పండ్లు కాయడం సాధ్యమైంది.
" వెరైటీ మామిడి పండ్లను తయారు చేసేందుకే ఈ ప్రయోగం చేశాం. అయితే.. ఒకే చెట్టుపై 121 రకాల మామిడి మొక్కలను అంటుకట్టాలనే ఆలోచన ట్రైనింగ్ సెంటర్ గత జాయింట్ డైరెక్టర్ రాజేశ్ ప్రసాద్‌కు వచ్చింది. సామాన్య పౌరులు కూడా ఈ విధానాన్ని ఉపయోగించొచ్చు."
- భాను ప్రకాశ్ రామ్, జాయింట్ డైరెక్టర్.