తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లక్ష బస్తాల ఎఫ్​సీఐ బియ్యం పట్టివేత

అసోంలోని ఓ ప్రైవేటు గోడౌన్​లో భారీ ఎత్తున బియ్యం సంచుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో ప్రభుత్వ అధికారులతో పాటు చాలా మంది ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

RICE SEIZURE
బియ్యపు సంచులు

By

Published : Jun 13, 2021, 11:00 PM IST

అసోంలోని మారుతీ క్వాలిటీ ప్రొడక్ట్​ ప్రైవేట్ లిమిటెడ్​ గోడౌన్​లో 50కేజీల లక్ష బియ్యం సంచుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ యజమాని దీపక్​ అగర్వాల్​ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ స్కాంలో ప్రభుత్వ అధికారులతో పాటు చాలా మంది ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కామ్​రూప్​ జిల్లాలో అనుమానంగా వెళుతున్న కంటైనర్​ల గురించి నదియార్​ పర్​ గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, జిల్లా అధికారులు తనిఖీలు చెపట్టారు. తనిఖీలలో బియ్యం సంచుల లోడ్​తో వెళుతున్న ఓ ట్రక్కును పట్టుకుని డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్​ ద్వారా అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం గురించి తెలుసుకున్న పోలీసులు, జిల్లా అధికారులు.. గోడౌన్​కు వెళ్లి లక్ష సంచుల్ని స్వాధీనం చేసుకున్నారు.

భారత ఆహార సంస్థ(ఎఫ్​సీఐ)కు చెందిన ఈ బియ్యాన్ని తమ బ్రాండ్​ పేరుతో ప్యాక్​ చేసి మేఘాలయాలోని అసోం రైఫిల్స్​కు ఎగుమతి చేయాలని ఈ కంపెనీ ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి గోడౌన్​లో ఉన్న 13 ట్రక్కులను సీజ్​ చేశారు. కాగా ఈ కంపెనీకి వివిధ దేశాలోని పెద్ద పెద్ద ఆహార సంస్థలతో సంబంధాలున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:'మైనారిటీలూ.. కుటుంబ నియంత్రణ పాటించండి'

ABOUT THE AUTHOR

...view details