తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుర్గా మండపంలో కాల్పులు- ఒకరు మృతి - దుర్గా మండంపంలో దుండగులు కాల్పులు

దుర్గా మండపంలో రక్తపాతం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు బాలికలకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ అయోధ్యలో(Uttar Pradesh Ayodhya News) జరిగింది.

firing in duga pandal
దుర్గా మండపంలో కాల్పులు

By

Published : Oct 14, 2021, 12:28 PM IST

ఉత్తర్​ప్రదేశ్(Up Crime News) అయోధ్య జిల్లాలో(Uttar Pradesh Ayodhya News) దారుణం జరిగింది. దుర్గాదేవి మండపంలోకి చొరబడిన దుండగులు.. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారు.

ఎలా జరిగింది?

ఫైజాబాద్​(Uttar Pradesh Ayodhya News) కొత్వాలీ ప్రాంతంలోని నీల్ గోదాం దుర్గా మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు దుండగులు రెండు బైకుల మీద వచ్చారు. ఆకస్మాత్తుగా మండపంలో ఉన్న మంజిత్​ యాదవ్​పై వారు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అతని పక్కన ఉన్న ఇద్దరు బాలికలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లఖ్​నవూలోని కేజీఎంయూ ట్రామా సెంటర్​కు తరలించారు.

కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి
దుండగుల కాల్పుల్లో గాయపడ్డ బాలిక

కాల్పుల అనంతరం.. మండపంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాంతో దుండగులు వెంటనే.. తమ బైకులను అక్కడే వదిలేసి పరారయ్యారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ నిందితుడ్ని పట్టుకుని, విచారిస్తున్నారు.

వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే దుండగులు దుర్గా మండపంలోకి చొరబడి, కాల్పులు జరిపినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని లఖ్​నవూ జోన్​ ఏడీజీ ఎస్​.ఎన్​.సాబత్​ తెలిపారు. ఘటన జరిగిన రోజు ఉదయం.. నిందితులకు, బాధితుడికి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ప్రాణాలు తీసిన పరోటా- ఆ తల్లీకూతుళ్లకు ఏమైంది?

ఇదీ చూడండి:కారు అద్దంలో మెడ ఇరుక్కొని బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details