తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రి సోదరుడి ఇంట్లో రూ.కోటి చోరీ.. మాజీ సీఎం ఫాంహౌస్​లోని టీవీ సైతం.. - తమిళనాడు క్రైమ్ న్యూస్

ఉత్తరాఖండ్ కేబినెట్​ మంత్రి సోదరుడి ఇంట్లో రూ. కోటి నగదును ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. మరోవైపు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీరుసెల్వం ఫాంహౌస్​లో ఓ టీవీని చోరీ చేశారు దొంగలు.

one crore robbery
మంత్రి సోదరుడి ఇంట్లో కోటి రూపాయల చోరీ

By

Published : Oct 15, 2022, 10:38 PM IST

ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లోని డోయీవాలా ప్రాంతంలో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్ కేబినెట్​ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ సోదరుడు, వ్యాపారి శిశ్​పాల్ అగర్వాల్​ ఇంట్లో రూ. కోటి నగదును ఎత్తికెళ్లిపోయారు. శిశ్​పాల్​ ఇంట్లోకి ప్రవేశించిన ఆరుగురు దుండగులు... ఆయన భార్య, ఇద్దరు పని మనుషులను బంధించి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. శిశ్​పాల్​ అగర్వాల్​.. ఇంటి బయట అమర్చిన సీసీటీవీలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

పన్నీరుసెల్వం ఫాంహౌస్​లో..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వంకు చెందిన ఫాంహౌస్​లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన తేనీ జిల్లాలోని పెరియకులం సమీపంలోని కైలాసపట్టిలో జరిగింది. శుక్రవారం రాత్రి దుండగులు ఫాంహౌస్ గోడ ఎక్కి మేడమీద ఉన్న గది తలుపులు పగలగొట్టి 54 అంగుళాల టీవీని ఎత్తికెళ్లినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూసే సరికి పైఅంతస్తులోని గది తాళాలు పగలగొట్టి కనిపించాయి. ఈ క్రమంలో పెరియకులం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details