మావోయిస్టులపై పోరులో(maoist latest news) ఝార్ఖండ్ పోలీసులు కీలక విజయం సాధించారు. తలపై రూ.కోటి రివార్డు ఉన్న సీపీఐ మావోయిస్టు(cpi maoist ) టాప్ కమాండర్ ప్రశాంత్ బోస్‌ను జంషెద్‌పుర్‌లో అరెస్టు చేశారు(Prashant bose arrest). అతని భార్య శీలా మరాండీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ సురక్షితమైన ప్రదేశంలో విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
- ప్రశాంత్ బోస్‌ను 'కిషన్ దా'(prashant bose maoist) అని కూడా పిలుస్తారు. అత్యంత సీనియర్ మావోయిస్టు నాయకుల్లో ఈయన ఒకరు. మవోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) చీఫ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత అది 2004లో సీపీఐ-ఎంఎల్(పీపుల్స్ వార్)లో విలీనమైంది. విప్లవ శక్తుల పునరేకీకరణను పర్యవేక్షించిన సిద్ధాంతకర్తలలో కిషన్ దా ఒకరు. ఆ తర్వాత ఇది అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు సంస్థ సీపీఐ(మావోయిస్ట్) ఏర్పాటుకు దారితీసింది.
- కిషన్ దా(Prashant bose ) ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, కేంద్ర మిలిటరీ కమిషన్‌లో సభ్యుడు. మావోయిస్టు పార్టీ తూర్పు ప్రాంత కార్యదర్శి. ఈశాన్య రాష్ట్రాలైన బిహార్, ఝార్ఖండ్ సహా బంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌లో విప్లవ కార్యకలపాలను పర్యవేక్షిస్తున్నారు. 75 ఏళ్ల వయసున్న ఈయన ఆనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. ఝర్ఖండ్‌లోని సరందా అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలు సాగించారు.
- కిషన్ దా స్వస్థలం బంగాల్లోని జాదవ్‌పుర్. సన్నిహితులు నిర్భయ్, కిషన్, కాజల్, మహేశ్ అనే పేర్లతో పిలుస్తారు.
- కిషన్ దా సతీమణి శీలా మరాండీ కూడా మాయియిస్టు పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. సీపీఐ మవోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్న ఏకైక మహిళ. 60ఏళ్లకు పైగా వయసుంటుంది. గతంలో 2006లో ఒడిశాలో ఈమె అరెస్టయ్యారు. ఆ తర్వాత రూర్కెలా జైలు నుంచి విడుదలయ్యారు. ఐదేళ్ల క్రితం మళ్లీ 'సీపీఐ మావోయిస్టు'లో చేరారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు అనుంబంధంగా మహిళా సంస్థలకు నిర్దేశం చేసే ఇంఛార్జ్‌గా వ్యవహరించారు.
- శీలా స్వస్థలం ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా. హేమ, ఆశ, బుధాని, ష్పబది అనే మారు పేర్లున్నాయి. ప్రశాంత్ బోస్, ఆయన సతీమణి శీలా మరండీ