పంజాబ్ పఠాన్‌కోట్‌లోని మమున్ మిలిటరీ స్టేషన్లో ప్రమాదం జరిగింది. శిక్షణా సమయంలో ప్రతికూల వాతావరణ ఏర్పడిన కారణంగా.. ఓ జవాన్ మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ శిక్షణా కార్యక్రమంలో 11 మంది ఆఫీసర్లు, 11 మంది జేసీఓలు, 120 మంది ఇతర ర్యాంక్‌లకు సంబంధించిన జవానులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పఠాన్‌కోట్ మిలిటరీ స్టేషన్లో ప్రమాదం.. జవాను మృతి - పఠాన్‌కోట్‌లో సైనికులకు గాయలు
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో జరిగిన ప్రమాదంలో ఓ జవాన్ చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్మీ జవాన్ మృతి
గాయపడిన సైనికులను పఠాన్‌కోట్‌లో ఉన్న మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారికి తగిన వైద్యసదుపాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
Last Updated : Aug 21, 2021, 10:02 PM IST