తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ కడుపులో కిలోన్నర వెంట్రుకలు- వైద్యులు షాక్​ - కొడగు వైద్య కళాశాల

మహిళ కడుపులో వెంట్రకల గుట్ట చూసి షాకయ్యారు వైద్యులు. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్​ చేసి కేజీన్నర వెంట్రుకలు బయటకు తీశారు. ఈ అరుదైన సర్జరీ ​ కర్ణాటక కొడగులో జరిగింది.

One and half kg of hair found in stomach of a woman
మహిళ కడపులో వెంట్రులకు చూసి వైద్యులు షాక్​

By

Published : Oct 27, 2021, 3:11 PM IST

కర్ణాటక కొడగులోని మడికేరిలో అరుదైన ఆపరేషన్​ చేశారు వైద్యులు. మహిళ కడపులో నుంచి కిలోన్నర వెంట్రుకలను బయటకు తీశారు. కొడగు వైద్య కళాశాలలో డాక్టర్​ అజిత్ కుమార్ నేతృత్వంలోని బృందం గంటలపాటు శ్రమించి ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.

కొద్ది రోజుల క్రితం ఓ మహిళ కడపునొప్పితో ఈ ఆస్పత్రిలో చేరింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వెంట్రుకల్లాంటి పదార్థంతో అది ఏర్పడినట్లు గమనించారు. ఆ మహిళ వెంట్రుకలు తినే అరుదైన మానసిక వ్యాధి 'ట్రికపేజియాతో' బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేశారు. కడపులో వెంట్రకలతో ఏర్పడిన కేజీన్నర గడ్డను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

మహిళ కడుపులో నుంచి బయటకు తీసిన వెంట్రుకలు

ట్రికపేజియా అనేది మానసిక రోగం. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ తమ వెంట్రుకలను తింటూ ఉంటారు. ఒక్కోసారి ఊడిన జుట్టును మొత్తం ఒకేసారి తినేస్తుంటారు.

ఇదీ చదవండి:ముఖంపై 8 కేజీల కణతి.. 16 సర్జరీలు చేసి చివరకు...

ABOUT THE AUTHOR

...view details