తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా!

కరోనా తగ్గట్లేదు సరికదా.. రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. అడుగడుగునా మహమ్మారి పొంచి ఉన్న ఈ సమయంలో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సోకుతూనే ఉంది. ఇప్పటికే పాజిటివిటీ రేటు 24.80%కి చేరింది. బుధవారం ఒక్కరోజే 3,82,315 మంది వైరస్‌ బారిన పడగా.. 3,780 మంది వైరస్‌కు బలయ్యారు.

one among four members tested positive to covid-19
పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

By

Published : May 6, 2021, 7:31 AM IST

దేశంలో పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి కొవిడ్‌-19 సోకుతోంది. పాజిటివిటీ రేటు 24.80% చేరింది. బుధవారం ఒక్కరోజులో 3,82,315 కేసులు నమోదవగా, 3,780 మరణాలు సంభవించాయి. ఈ నెల 2వ తేదీన గరిష్ఠంగా 3,689 మంది చనిపోగా ఇప్పుడు అంతకంటే 91 మంది అధికంగా కన్నుమూశారు. క్రితం రోజుతో పోలిస్తే 1,22,443 (7.35%) పరీక్షలు తగ్గాయి. అంతే సంఖ్యలో పరీక్షలు నిర్వహించి ఉంటే ఇప్పుడొచ్చిన పాజిటివిటీ రేటు ప్రకారం మరో 30వేల కేసులు పెరిగి ఉండేవి.

మరోవైపు, మొత్తం కేసుల సంఖ్య 2,06,65,148కి, మొత్తం మరణాల సంఖ్య 2,26,188కి చేరింది. ఏప్రిల్‌ 30-మే 2 తేదీలతో పోలిస్తే మే3-5 తేదీల నాటికి 9,60,621 (17%) పరీక్షలు తగ్గాయి. దీనివల్ల కేసుల వృద్ధి మందగించినట్లు కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు భారీగా ఉన్న సమయంలో పరీక్షల సంఖ్యను తగ్గించడాన్ని వైద్యనిపుణులు తప్పుబడుతున్నారు.

ఇవీ చదవండి:అక్కడ ప్రతి 20 నిమిషాలకు ఓ పోలీసుకు కరోనా

ఇదీ చదవండి:'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'

తమిళనాడు, బంగాల్‌, హరియాణా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌లలో ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 14 రోజుల్లో మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు వృద్ధిచెందాయి. మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు 60వేల లోపు కేసులు నమోదవడం కొంత ఊరట కలిగించే అంశం.

పెరిగిన పాజిటివిటీ రేటు..

గత వారం రోజుల్లో దేశంలో సగటున 21.46% పాజిటివిటీ రేటు నమోదుకాగా, 16 రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ, 19 రాష్ట్రాల్లో అంతకంటే అధికంగా నమోదైంది. రాజస్థాన్‌లో ఏకంగా 62.34% పాజిటివిటీ రేటు రావడం అక్కడి ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది. బుధవారం ఇదివరకు ఎన్నడూలేనన్ని మరణాలు సంభవించడం పరిస్థితుల తీవ్రతను చాటుతున్నాయి.

ఇవీ చదవండి:అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌!

మనసును కుంగదీస్తున్న కరోనా మహమ్మారి మరి ఎలా?

ABOUT THE AUTHOR

...view details