తెలంగాణ

telangana

కరోనా రోగుల కోసం 'పాకెట్ వెంటిలేటర్​'

By

Published : Jun 13, 2021, 11:37 AM IST

ప్రస్తుత కొవిడ్​ విజృంభణ వేళలో ఆక్సిజన్, వెంటిలేటర్లకు డిమాండ్ బాగా​ పెరిగింది. ప్రాణవాయువు​ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో.. కోల్​కతాకు చెందిన ఓ ఎలక్రానిక్​ ఇంజినీర్..​ కరోనా రోగుల కోసం 'పాకెట్​ వెంటిలేటర్'​ను తయారు చేశారు. దీని సాయంతో పూర్తిస్థాయి వైద్యం అందేలోపు రోగి ప్రాణాలను నిలబెట్టుకోవచ్చని చెబుతున్నారు.

pocket ventilator
పాకెట్​ వెంటిలేటర్​

కొన్నిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఎట్టకేలకు కోలుకున్నారు. అయితే.. వైరస్​ బారిన పడ్డప్పుడు తాను అనుభవించిన బాధలు మరెవరికీ కలగకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే.. 'పాకెట్​ వెంటిలేటర్'​ అనే వినూత్న పరికరాన్ని రూపొందించారు. ఆయనే బంగాల్​ కోల్​కతాకు చెందిన డాక్టర్​ రామేంద్ర లాల్​ ముఖర్జీ.

పాకెట్​ వెంటిలేటర్​
పాకెట్​ వెంటిలేటర్​తో రామేంద్ర లాల్​

ఈ పరికరం సాయంతో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే రోగులకు మేలు కలుగుతుందని రామేంద్ర లాల్​ చెప్పారు. పూర్తి స్థాయి వైద్యచికిత్స అందేలోపు రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీని ధర కూడా చాలా తక్కువేనని అన్నారాయన.

"నాకు కొవిడ్ సోకిన సమయంలో నా ఆక్సిజన్ స్థాయులు 88కి పడిపోయాయి. దాంతోపాటుగా తీవ్రమైన శ్వాససమస్యలు ఎదురయ్యాయి. అదృష్టవశాత్తు నేను కరోనా నుంచి కోలుకున్నాను. కానీ, నాలా బాధపడుతున్న వారికి ఏదైనా సాయం చేయాలనే ఆలోచన నన్ను కుదిపేసింది. అందుకే ఈ పరికరాన్ని కనిపెట్టాను. పాకెట్​ వెంటిలేటర్​ తయారు చేసేందుకు నాకు 20 రోజుల సమయం పట్టింది."

-డాక్టర్​ రామేంద్ర లాల్​ ముఖర్జీ, పాకెట్​ వెంటిలేటర్​ రూపకర్త

తాను తయారు చేసిన పాకెట్​ వెంటిలేటర్​లో రెండు భాగాలు ఉంటాయని వివరించారు రామేంద్ర లాల్​. మొదటిది బ్యాటరీ యూనిట్​ కాగా.. రెండోది మాస్క్​కు జోడించి ఉన్న వెంటిలేటర్​ అని ఆయన చెప్పారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితమై.. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది తప్పకుండా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

పాకెట్​ వెంటిలేటర్​ పని తీరును వివరిస్తున్న డాక్టర్​ రామేంద్ర లాల్​ ముఖర్జీ
పాకెట్​ వెంటిలేటర్​కు అమర్చిన బ్యాటరీ

తాను తయారు చేసిన ఈ పాకెట్​ వెంటిలేటర్​ పరికరానికి పేటెంట్​ హక్కులు పొందేందుకు రామేంద్ర లాల్​ దరఖాస్తు చేశారు. స్వతహాగా ఎలక్ట్రానిక్​ ఇంజినీర్​ అయిన రామేంద్ర అంతకుముందు కూడా సామాన్య జనం కోసం కొన్ని విభిన్న పరికరాలను తయారు చేశారు.

ఇదీ చూడండి:ఇస్రో వెంటిలేటర్లు- ఎవరైనా తయారు చేయొచ్చు!

ఇదీ చూడండి:నిరుపయోగంగా 'పీఎం కేర్స్​' వెంటిలేటర్లు.. ఎందుకిలా?

ABOUT THE AUTHOR

...view details