కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్-హరియాణా రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' కార్యక్రమంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దిల్లీ వైపు సాగుతున్న రైతులను సింఘు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
రైతులు దిల్లీలోకి వెళ్లకుండా సాయుధ పోలీసులు నిలువరించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
- దిల్లీ-బహదుర్‌గఢ్ రహదారికి సమీపంలో టిక్రీ బోర్డర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోన్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, బాష్పవాయువు ప్రయోగించారు.
- పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యులు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను ట్రాక్టర్‌లో నింపుకొని దిల్లీకి బయలుదేరారు.
- ఛలో దిల్లీ కార్యక్రమానికి వస్తున్న రైతులను పానిపత్ సమీపంలో జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు.