తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'18 ప్లస్​'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్​! - కొవిడ్ టీకా కోసం కొవిన్ పోర్టల్​లో ఆన్ సైట్ రిజిస్ట్రేషన్

18 నుంచి 44 ఏళ్లవారికి కొవిడ్ టీకా కోసం.. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే కొవిన్​ పోర్టల్​లో నమోదుకు అనుమతిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ల వృథాను తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

On-site registration for 18-44 years age group now enabled on CoWin
టీకా కోసం ఇక ఆన్​సైట్​లోనూ రిజిస్ట్రేషన్

By

Published : May 24, 2021, 4:29 PM IST

18 నుంచి 44 ఏళ్ల వారికి టీకా కోసం కొవిన్ పోర్టల్​లో ఆన్​ సైట్(టీకా కేంద్రాల వద్ద) రిజిస్ట్రేషన్, అపాయింట్​మెంట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లోనే(సీవీసీ) అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రైవేటు సీవీసీల్లో ఈ సదుపాయం ఉండదని, అవి తమ టీకా షెడ్యూళ్లను ప్రత్యేకంగా ప్రకటించాలని కేంద్రం ఆదేశించింది.

ఇప్పటివరకూ మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కేవలం ఆన్​లైన్​లో నమోదు చేసుకున్నవారికే టీకాలు వేస్తున్నారు. దీనివల్ల వ్యాక్సిన్ తీసుకోవాల్సిన రోజు లబ్ధిదారులు రాకపోతే కొన్ని డోసులు వృథాగా మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నేరుగా ప్రభుత్వ సీవీసీల్లోనే రిజిస్ట్రేషన్లకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు ఆయా కేంద్రాలకు వెళ్లి, కొవిన్‌ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేయించుకొని వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపింది.

ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కొవిన్‌ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేయించే విషయంలో స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలిపెట్టింది కేంద్రం. టీకాల వృథాను అరికట్టడంలో ఇదో అదనపు చర్య అని తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా వేళ.. నత్తనడకన టీకాల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details