దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) రెండో వార్షికోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం అన్నివిధాలుగా ప్రయత్నిస్తోందని అన్నారు. పంటల సేకరణ కోసం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)లో చరిత్రాత్మక పెరుగుదలను సాధించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.
"గత ఏడేళ్లలో వ్యసాయ విధానంలో మార్పు కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నీటి పారుదల ప్రాజెక్టులు మొదలుకొని.. రైతు రుణాలు పెంచడం, పంటకు సరైన బీమా కల్పించడం, నేలపై దృష్టి సారించడం, మధ్యవర్తులను తొలగించడం వంటి ఎన్నో ప్రయత్నాలు ఇందులో ఉన్నాయి."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి