తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వివాహానికి పటిష్ఠ పోలీస్ భద్రత.. కారణమిదే? - దళిత వివాహానికి పటిష్ఠమైన పోలీస్ భద్రత.. కారణమిదే?

గుజరాత్​ సబర్​కంతా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓ దళిత వివాహం నిర్వహించారు పోలీసులు. పెళ్లి తంతులో భాగంగా నిమ్నకులాలకు చెందిన వరుడు గుర్రంపై ఊరేగింపుగా రావటాన్ని అక్కడి అగ్రకులాల ప్రజలు అడ్డుకున్న నేపథ్యంలో తమకు రక్షణ కావాలని వరుడు తల్లిదండ్రులు కోరారు. ఈ క్రమంలో బలగాలను మోహరించామని డీఎస్పీ చౌహాన్​ తెలిపారు.

On kin's request, cops protect Dalit's wedding procession in Gujarat
ఆ వివాహానికి పటిష్ఠమైన పోలీస్ భద్రత.. కారణమిదే?

By

Published : Mar 7, 2021, 11:10 AM IST

Updated : Mar 7, 2021, 12:37 PM IST

దళిత వివాహానికి పటిష్ఠ పోలీస్ భద్రత

గుజరాత్​ సబర్​కంతా జిల్లా భజ్​పురా గ్రామంలో పటిష్ఠ భద్రత మధ్య దళితుల వివాహాన్ని జరిపారు పోలీసులు. నిమ్నకులాలకు చెందిన వరుడు.. గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి రావటాన్ని స్థానికంగా ఉన్న అగ్రకులాలు అడ్డుకున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో భారీగా వెలుగుచూశాయి.

ఈ నేపథ్యంలో తమకు భద్రత కావాలని వరుడి తల్లిదండ్రులు కోరడం వల్ల వివాహం జరిగే ప్రాంతంలో ఓ డీఎస్పీ, ఏడుగురు ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లను మోహరించామని వివరించారు డీఎస్పీ చౌహాన్​. పోలీసుల సహకారంతో నరేష్​ వంకర్ కుమారుడు దుర్లబ్ వివాహం శాంతియుతంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వివాహానికి సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు దుర్లబ్​.

వివాహానికి పోలీస్ భద్రత
వివాహానికి పోలీస్ భద్రత
పోలీసుల మోహరింపు
గుర్రంపై ఊరేగింపుగా వస్తున్న వరుడు

ఇదీ చదవండి :ఆ నాలుగు రాష్ట్రాల్లో మొక్కుబడిగా మహిళల 'వాటా'

Last Updated : Mar 7, 2021, 12:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details