తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'18 ఏళ్లలోపు ముస్లిం యువతులు పెళ్లికి అర్హులే!' - ఛండీగడ్​ హైకోర్టు

ముస్లిం పర్సనల్​ లా ప్రకారం యుక్త వయస్సుకొచ్చి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు వారికి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కుందని పంజాబ్​ అండ్​ హరియాణా​ హైకోర్టు స్పష్టం చేసింది. 17 సంవత్సరాల వయస్సుగల ఓ ముస్లిం యువతి, మరో ముస్లిం యువకుడిని పెళ్లాడిన కేసులో ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

On attaining puberty, Muslim girl can marry anyone by law: Punjab, Haryana HCs
'ముస్లింలు వయస్సు 18 ఏళ్ల కన్నా తక్కువున్నా పెళ్లి చేసుకోవచ్చు'

By

Published : Feb 11, 2021, 4:10 PM IST

ముస్లిం పర్సనల్​ లా ప్రకారం 18 సంవత్సరాల కంటే వయస్సు తక్కువ ఉండి యుక్తవయస్కులైన యువతీ, యువకులు వారి ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందని పంజాబ్ అండ్​ హరియాణా​ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్​ 195లోని ముస్లిం లా నియమాల్ని, సర్​ దిన్షా ఫర్దుంజీ ముల్లా పుస్తకంలోని నిబంధనలను పరిశీలించిన అనంతరం జస్టిస్​ అల్కా సరిన్​ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 25న తీర్పు ఇచ్చింది.

ఓ ముస్లిం యువతీ (17 సంవత్సరాలు), యువకుడు( వయస్సు 36) ప్రేమించుకున్నారు. వారి మధ్య వయస్సు తేడా ఎక్కువ ఉందని పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దాంతో తాము జనవరి 21న పెళ్లి చేసుకున్నామని దంపతులు చెప్పారు. పెద్దల నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించవలసిందిగా మొహాలీ ఎస్పీని కోరారు. ఆ తర్వాత పంజాబ్​, హరియాణా​ హైకోర్టు ఆశ్రయించారు. పిటిషనర్లు తరఫున న్యాయవాదులు.. ముస్లిం పర్సనల్ లా ప్రకారమే వారు పెళ్లి చేసుకున్నారని వాదించారు. అనంతరం.. కోర్టు పైతీర్పు ఇచ్చింది.

ఇదీ చూడండి:చిన్నారి చికిత్సకు ప్రధాని రూ.6 కోట్ల సాయం!

ABOUT THE AUTHOR

...view details