Omicron variant in India: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవరపెడుతున్న నేపథ్యంలో కొత్త రకం కరోనాతో భారతీయులకు ముప్పు తక్కువేనని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భారతీయులు.. ఒమిక్రాన్ సహా ఇతర కొవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ పొందారంటున్న నిపుణులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొవిడ్ అంశంలో ఏర్పాటైన కన్సార్టియం ఇన్‌సాకాగ్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ ఈ మేరకు అభిప్రాయపడ్డారు.
ఒమిక్రాన్‌ను నుంచి యాండిబాడీలు రక్షిస్తాయి
డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో కొవిడ్ రెండోదశ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందన్న షాహిద్ జమీల్ ఊహించిన దానికంటే అధిక నష్టాన్ని కలిగించిందన్నారు.
Covid Sero survey in India
దేశవ్యాప్తంగా నిర్వహించిన నాలుగో సెరో సర్వేలో దేశంలోని 67 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలిందని జమీల్ చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో వేగం పుంజుకోని సమయంలోనే సుమారు 93 నుంచి 94 కోట్ల మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వివరించారు. ఇటీవల నిర్వహించిన సెరో సర్వేలో దిల్లీలో 97 శాతం, ముంబయిలో 85 నుంచి 90 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలిన విషయాన్ని గుర్తుచేశారు.