ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్‌లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గురువారమే దేశంలో ఒమిక్రాన్ కేసులు తొలిసారి నమోదయ్యాయి. విదేశాల నుంచి కర్ణాటక చేరుకున్న ఇద్దరికి వైరస్ నిర్ధరణ అయింది.
అయితే.. తక్కువ కేసులే నమోదయ్యాయి కాబట్టే పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు డా. టమోరిష్ కోలే.
''ఒమిక్రాన్ మనకు సరికొత్త సవాల్ విసురుతోంది. భారత్‌లో ఈ వైరస్ వెలుగు చూస్తుందని తెలుసు. ఇది అంటువ్యాధి. అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలకు కూడా ఇది సవాలే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు తక్కువ కేసులే వచ్చాయి. ఈ పరిస్థితిని జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.''
- డా. టమోరిష్ కోలే, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు
రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్ సమర్థంగా ఎదుర్కొంటుందన్న విశ్లేషణల తరుణంలో.. బూస్టర్ డోసుల ఆవశ్యకతపై సార్స్-కోవ్-2 జీనోమిక్ సీక్వెన్సింగ్ కన్సార్షియం(ఇన్సాకాగ్) కీలక వ్యాఖ్యలు చేసింది. 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు వేయడం వల్ల.. రిస్క్ తగ్గించవచ్చని అభిప్రాయపడింది. కొవిడ్-19 మార్గదర్శకాలను అత్యంత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది.
ఇదీ చూడండి:భారత్‌లో బూస్టర్ డోస్‌కు శాస్త్రవేత్తల సిఫార్సు- వారికే ముందు!
30 దేశాలకుపైగా..
ఒమిక్రాన్ నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో తొలుత బయటపడింది. రెండు రోజులకే డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్‌ను ఆందోళనకర రకం- వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా(వీఓసీ) ప్రకటించింది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకుపైగా విస్తరించింది.
కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్లలో ఒమిక్రాన్ వేరియంట్లోనే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తం 50 మ్యుటేషన్లు ఉంటే.. కేవలం స్పైక్ ప్రొటీన్లోనే 32 ఉన్నట్లు గుర్తించారు.
రీఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువే..
Omicron Causes 3 Times Reinfections than Delta: ఒమిక్రాన్ రీఇన్ఫెక్షన్ రిస్క్‌ను పెంచుతుందని పలు ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. మ్యుటేషన్ల కారణంగా వచ్చే నిర్మాణాత్మక మార్పుల నుంచి ఇది సంభవించొచ్చని నిపుణులు అంటున్నారు.
- "డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ మూడు రెట్లు ఎక్కువ రీఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది."-- దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అధ్యయనం నివేదిక సారాంశం
దక్షిణాఫ్రికాలో ఈ కేసులు ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతుండటం కూడా గమనించొచ్చు. నవంబర్ 27 నాటికి అక్కడ 28 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా.. వీరిలో 35 వేల మంది రీఇన్ఫెక్షన్కు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఒకసారి కరోనా సోకిన తర్వాత ఏర్పడే రోగనిరోధకత నుంచి తప్పించుకోగలిగే సామర్థ్యం ఒమిక్రాన్‌కు ఉందా? లేదా? అనే విషయంపై జరిగిన తొలి అధ్యయనం ఇదే కావడం గమనార్హం. ఈ అధ్యయనాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
ఒకసారి కరోనా సోకి దాని నుంచి కోలుకున్న 90 రోజులకు తిరిగి పాజిటివ్‌గా తేలితే దీనిని రీఇన్ఫైక్షన్గా పరిగణిస్తున్నారు.
ఇదీ చూడండి:'ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచస్థాయి ఒప్పందం అవసరం'
ప్రమాదకరంగా ఆర్ నాట్ విలువ..