Omicron cases in Gujarat: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది.
గుజరాత్లో రెండు..
గుజరాత్లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3కు చేరింది.
ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో దగ్గరగా మెలిగిన ఆ ఇద్దరు వ్యక్తులకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. లక్షణాలేవీ లేవని జామ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపారు
ముంబయిలో ఒకటి..
ముంబయిలోని ధారావిలో ఒమిక్రాన్ కేసు బయటపడింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. బాధితుడిని సెవన్ హిల్స్ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
రాజస్థాన్ టూ దిల్లీ..
Rajasthan Omicron Cases: రాజస్థాన్‌లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని కలిసిన ఓ మహిళకు దిల్లీలో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆమెను లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఒమిక్రాన్ నిర్దరణ పరీక్షల కోసం ఆమె నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాను రూపొందించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు.