తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా - omicron vaccine release date

వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ తీసుకురానున్నట్లు సీరం ఇన్​స్టిట్యూట్ సీఈఓ అదర్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణమని నివేదికలు వస్తోన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

omicron vaccine in india
మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా

By

Published : Aug 16, 2022, 6:44 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. పలు దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో వాటిని ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేయడం అనివార్యమవుతోంది. ఈ క్రమంలోనే ఒమిక్రాన్​ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌) కూడా ప్రత్యేకంగా ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకాను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణమని నివేదికలు వస్తోన్న వేళ.. సీరం చీఫ్‌ ఈ మేరకు మాట్లాడారు.

'భారత్‌లో బూస్టర్‌ డోసుగా గతంలో తీసుకున్న టీకాలే ఇస్తున్నారు. అయితే, ఒమిక్రాన్‌పై పోరాడే వ్యాక్సిన్‌ కోసం నోవావాక్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.5పై సమర్థంగా పోరాడే వ్యాక్సిన్‌ను ఆరు నెలల్లోపే తీసుకువస్తాం. బూస్టర్‌గా ఈ వ్యాక్సిన్‌ ఎంతో మేలు చేస్తుంది' అని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనావాలా వెల్లడించారు.

నోవావాక్స్‌ ప్రయోగాలు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయని.. నవంబర్‌, డిసెంబర్‌ నాటికి అనుమతి కోసం అమెరికా నియంత్రణ సంస్థను సంప్రదించే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అయితే, భారత్‌లోనూ వేరుగా క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టాలా లేదా అనే అంశం ఇక్కడి నియంత్రణ సంస్థల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తేలికగా తీసుకోవద్దన్న ఆయన.. అది కాస్త సీరియస్‌ ఫ్లూగా పరిణమించొచ్చని హెచ్చరించారు.
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే మోడెర్నా రూపొందించింది. అంతేకాకుండా.. దీని వినియోగానికి బ్రిటన్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఈ తరహా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details