తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా? - ఒమిక్రాన్ తీవ్రత

Omicron Natural vaccine: ఒమిక్రాన్ వ్యాప్తి మంచిదేనా? ఈ వేరియంట్ నేచురల్ వ్యాక్సిన్​లా పనిచేసి కొవిడ్​ను అంతం చేస్తుందా? మహారాష్ట్ర వైద్యాధికారి చేసిన పలు వ్యాఖ్యలతో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆయనేం చెప్పారు? దీనిపై ఇతర నిపుణులు ఏమన్నారు? ఓసారి చూస్తే...

Omicron natural vaccin
Omicron natural vaccin

By

Published : Jan 2, 2022, 3:36 PM IST

Omicron Natural vaccine: 'ఒమిక్రాన్ ప్రాకృతిక వ్యాక్సిన్​లా పనిచేస్తుంది. కొవిడ్ 19ను ఎండెమిక్ దశకు చేర్చేందుకు ఈ వేరియంట్ ఉపయోగపడుతుంది'... మహారాష్ట్రకు చెందిన వైద్యాధికారి ఒకరు ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరిగింది. దీని ఆసరాగా తప్పుడు వార్తలు సైతం ప్రసారమయ్యాయి.

అయితే, వైద్యాధికారి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఒమిక్రాన్​ను 'సహజ వ్యాక్సిన్​'గా చెప్పడం చాలా ప్రమాదకరమని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ పేర్కొన్నారు.

Omicron to end Covid 19

"దీర్ఘకాల కొవిడ్​ను పరిగణనలోకి తీసుకోకుండా.. బాధ్యతారాహిత్యమైన వ్యక్తులే ఇలాంటి విషయాలను ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. దీని వల్ల అలసత్వం ఏర్పడుతుంది. మధుమేహం, పౌష్టికాహార లోపం, వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న భారత్​లో.. వైరస్​కు ఎక్స్​పోజ్​ కావాలని ప్రజల్ని కోరడం మంచిది కాదు. మనకు పూర్తిగా తెలియని వైరస్ గురించి ఇలా చెప్పడం.. శాస్త్రీయంగా సరికాదు."

-షాహిద్ జమీల్, వైరాలజిస్ట్

మరో అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ గిరిధర ఆర్ బాబు సైతం ఈ ప్రచారాన్ని ఖండించారు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. అది వ్యాక్సిన్ కాదని స్పష్టం చేశారు.

"ఈ వేరియంట్(ఒమిక్రాన్) వల్ల ప్రజలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తప్పుడు సమాచారం నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాధారణ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజలకు వేరియంట్ల నుంచి రక్షణ లభించదు. ఒమిక్రాన్ వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సాక్ష్యాలతో నిరూపితమైతేనే విశ్వసించాలి. వ్యక్తిగత భావనలకు స్థానం లేదు."

-గిరిధర బాబు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా, లైఫ్​కోర్స్ ఎపిడమాలజీ హెడ్

Omicron long term complications

ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక డైరెక్టర్ షుచిన్ బజాజ్ సైతం ఒమిక్రాన్​పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ వేరియంట్ వల్ల దీర్ఘకాల కొవిడ్ సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని అన్నారు. 'ఊపిరితిత్తులతో పాటు గుండె, మెదడు, కిడ్నీలలోనూ ఈ వైరస్ ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి దీర్ఘకాల ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలీదు. కొవిడ్ బాధితుల్లో మెదడు సంబంధిత సమస్యలు బయటపడటం మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఒమిక్రాన్​ను వ్యాక్సిన్ అని భావించకూడదు. నిజానికి ఈ వేరియంట్ వల్ల ఐసీయూలో చేరినవారూ ఉన్నారు. అనేక మరణాలూ సంభవించాయి. డెల్టాతో పోలిస్తే కొద్దిగా తక్కువ ప్రమాదకరంగా ఉంది. అయినప్పటికీ.. మనం జాగ్రత్తగా ఉండాలి' అని సూచించారు.

Omicron Herd Immunity

అయితే, తక్కువ తీవ్రతతో ఎక్కువ విస్తరించే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మహమ్మారి వ్యాప్తికి విరామం లభించే అవకాశం ఉందని లఖ్​నవూలోని రీజెన్సీ హెల్త్ వైద్య నిపుణుడు యశ్ జవేరీ తెలిపారు. డెల్టా వేరియంట్​ను ఎదుర్కొనే శక్తిని ఈ వేరియంట్ ఇస్తుందని చెప్పారు. ఎక్కువ వ్యాపించడం వల్ల.. హెల్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని వివరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details